Take a fresh look at your lifestyle.

కేసీఆర్​ వెంట్రుక కూడా పీకలేరు

  • కాళేశ్వరం ప్రాజెక్టు వేరే దేశంలో కట్టి ఉంటే కీర్తించేవారు.
  • సత్కారాలు చేసేవారు. 
  • కుళ్లు రాజకీయాలు ఉన్న దేశంలో అవి సాధ్యం కావు. 
  • ఇదంతా కాంగ్రెస్​, బీజేపీ కుట్ర. 
  • కాళేశ్వరంపై హరీశ్ రావు ప్రజంటేషన్ లోనే అంతా ఉంది.
  • రాష్ట్ర ప్రజల కోసమే విధానపరమైన నిర్ణయాలు. 
  • కేసీఆర్ ​కు నోటీసులు, విచారణ పేరుతో తాత్కాలికంగా వేధింపులు.
  • రూ. 94 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎక్కడిది.
  • బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​.
ముద్ర, తెలంగాణ బ్యూరో: వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను దాటిపోయేలా తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను నాలుగేళ్లలోనే కట్టినందుకు నోటీసులు ఇస్తారా? అని నిలదీశారు.కేసీఆర్ ను  పిలిచి ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమేనని అన్నారు.రేవంత్ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తికి వంద జన్మలెత్తినా కేసీఆర్ గొప్పతనం అర్థం కాదన్నారు. బుధవారం  బీఆర్ కే భవన్ ముందు మీడియాతో  కేటీఆర్ మాట్లాడుతూ, తనకు పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఓ ఐదు నిమిషాలు కూసొని కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటో తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం కాదు ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ? ఎన్ని కేసులు పెట్టినా ? 420 హామీలు, ఆరు గ్యారెంటీ అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ఎంత ప్రయత్నించినా?  మరలనియ్యమన్నారు. ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంటామన్నారు.ఎన్ని రకాలుగా వేధించినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు.. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే దాకా వెంటాడుతూనే ఉంటామన్నారు. తెలంగాణలోని వాగులు, వంకలు, నదులు, చెరువుల మీద కేసీఆర్ కు ఉన్నంత సంపూర్ణ అవగాహన సమకాలిన రాజకీయాల్లో దేశంలో ఇంకో రాజకీయ నేతకు లేదన్నారు. రేవంత్ సర్కార్ ఎన్ని కమిషన్లు వేసినా కేసులు పెట్టినా చివరకు ధర్మం న్యాయమే గెలుస్తుందన్నారు. నిజాలు బయటికి వస్తాయన్నారు. అల్టిమేట్ గా తెలంగాణ సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుందన్నారు.
రేవంత్ రెడ్డి ఓ చిల్లర ముఖ్యమంత్రి గవర్నమెంట్ ను నడపడం చేతగాని ముఖ్యమంత్రి అని కేటీఆర్ ధ్వజమెత్తారు. చివరకు మంత్రులకు శాఖలు కేటాయించే అధికారం కూడా లేని ముఖ్యమంత్రి అని మండిపడ్డారు.ఢిల్లీకి పోయి పోర్ట్ ఫోలియోలు నిర్ణయించుకునే దౌర్భాగ్య స్థితిలో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడికి క్యాబినెట్ అంటే అర్థం కాదు. కేబినేట్ ఎలా పనిచేస్తుందో తెలియదని విమర్శించారు.ఆయన ఆలోచనలు వేరు ఆయన అజెండా వేరన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాల కంటే రేవంత్ రెడ్డికి  రాజకీయ ప్రయోజనాలు, రాక్షసానందం,పైశాచిక ఆనందమే ముఖ్యమేనని  అన్నారు. చిల్లర పనులు చేసి బ్యాగులు మోసి రేవంత్ రెడ్డి జైల్లో పడ్డాడు కాబట్టే…. మా వాళ్లను కూడా కొంతమందిని జైల్లో పెట్టాలన్నదే ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకేమీ కాదన్నారు.కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును వేరే దేశాల్లో కట్టి ఉంటే గొప్పగా కీర్తించి సత్కారాలు చేసే వాళ్లు అన్నారు.కానీ కుసంస్కారం, కుళ్లు రాజకీయాలు ఉన్న భారత్‌లో ఇలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందన్నారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఇరికించాలన్న కుట్రతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.అందులో భాగంగా 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఇలా బద్నాం చేసేందుకు కుయక్తులు పన్నారని మండిపడ్డారు.రెండు రోజుల క్రితం హరీష్‌రావు ఇచ్చిన ప్రజంటేషన్ చూసి ఉంటే కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన వచ్చేది అని కేటీఆర్‌ అన్నారు. ఉన్న అనుమానాలు, అపోహలను క్లియర్ చేసేలా ఆ ప్రజంటేషన్ ఉందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టును కేబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. ఒక ప్రాజెక్టు కట్టాలని, ఎంత డబ్బులు పెట్టానలే, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే విషయాలు గురించి ఆలోచించి ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయని అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను అమలు పరచాల్సింది ప్రభుత్వ యంత్రాంగమని తెలిపారు. ఇందులో దాచడానికి దాపరికం ఏం లేదన్నారు.ఈ దేశంలో మాత్రం ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు మారిపోయిందన్నారు కేటీఆర్. మేడిగడ్డపై ఏదో జరిగిందని ఓ నాయకుడు అంటే అవును జరిగిపోయిందని మరో వ్యక్తి మాట్లాడుతున్నారన్నారు.రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి బీజేపీ, కాంగ్రెస్‌ ఒకరినొకరు కాపాడుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు.
  • అంతా ప్రజలకు తెలుసు.
కాళేశ్వరం వల్ల జరిగిన మంచి ప్రజలకు తెలుసన్నారు. ఎంత విస్తీర్ణంలో వ్యవసాయం జరిగిందో లెక్కలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎంత దిగుబడి వచ్చిందో కూడా ప్రజలకు బాగా తెలుసు అన్నారు. ఇదంతా మంత్రివర్గ నిర్ణయమని ఈటల రాజేందర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఈ నిర్ణయంలో ప్రతి మంత్రి భాగమై ఉన్నారని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ఇంత ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా కేసీఆర్‌కు వేరే దేశాల్లో అయితే పురస్కారం ఇచ్చే వాళ్లు అని అన్నారు కేటీఆర్. భారత దేశంలో ఈ మధ్య నాలుగేళ్ల కాలంలో ఇలాంటి ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రాజెక్టు ఆసాధ్యమన్నారు. నర్మదా, బాక్రానంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు దశాబ్ధాలు కట్టారని గుర్తు చేశారు. కానీ అద్భుతం చేసిన కేసీఆర్‌కు కమిషన్లు, నోటీసులు, విచారణ పేరుతో వేధింపులు లభిస్తున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి తనకు పిల్లను ఇచ్చిన మామ దగ్గర కూర్చొని నేర్చుకుంటే మంచిదన్నారు కేటీఆర్. ఐదు నిమిషాలు కూర్చొని బుద్దీ జ్ఞానం తెచ్చుకుంటే బెటర్ అన్నారు. 94వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అని తెలివితక్కువోడే అంటారనే మాటలు గుర్తు చేశారు. ఆ తెలివి తక్కువ వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. వంద కంపోనెట్స్ ఈ ప్రాజెక్టులో ఉంటే కేవలం మేడిగడ్డ వద్ద జరిగిన రెండు పిల్లర్లు పగుళ్లు వచ్చిందన్నారు. ఇది కూడా కాంగ్రెస్ నాయకుల ఏదో చిల్లర పని చేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు.
  • మేం భయపడం.
ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు కేటీఆర్. కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్టు వెల్లడించారు. రేపు ప్రజాకోర్టుల్లో ఈ పార్టీలకు శిక్ష పడుతుందని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి లాంటి చిల్లరగాడి వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. కేసీఆర్ వెంట్రుక కడా పీకలేరని ఘాటుగా మాట్లాడారు. రేవంత్ గురువునే రాష్ట్రం నుంచి తరిమేసిన చరిత్ర కేసీఆర్‌ది అని చంద్రబాబు అంశాన్ని ప్రస్తావించారు. కచ్చితంగా రేవంత్ రెడ్డికి అలాంటి గతే పడుతుందని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.