Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చొర‌వ.. అధ్య‌క్షులు సీతారాం ధూళిపాళ

ముద్ర గండిపేట్ : మ‌ణికొండ మున్సిపాలిటీ ప‌రిధిలో ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జరుగుతుంద‌ని మున్సిప‌ల్ బీఆర్ ఎస్ పార్టీ అధ్య‌క్షులు సీతారాం ధూళిపాళ అన్నారు.మంగ‌ళ‌వారం మణికొండ బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు,కార్యకర్తలు మొదలు పెట్టిన గుడ్ మార్నింగ్ మణికొండ మార్నింగ్ వాక్కు ప్రజల తరపున పూర్తి మద్దతు లభిస్తుందని ఆయ‌న వ్యాఖ్యానించారు.పుప్పాలగూడ పరిధిలోని పెంటయ్య నగర్ 1, 2 ప్రాంతాలలోనీ ఇరుకుగా ఉన్న వీధి వీధికి తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వ‌హించారు.అసంపూర్తిగా ఉన్న చిన్న పాటి రహదారులతో పాటు డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేని,కుప్పతొట్టిగా కుప్పలు కుప్పలుగా చెత్తాచెదరం పడి ఉండి దోమల బెడదతో తీవ్ర ఇబ్బందిగా ఉందనీ, మంచి నీటి సరఫరా కూడా సరీగా లేనందు వ‌ల్ల‌ ఇక్కట్ల పాలౌతున్నామని స్థానిక ప్రజలు తమ బాధ‌లను త‌న దృష్టికి తీసుకు వ‌చ్చార‌న్నారు.ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్థానికంగా ఉన్న హోటల్ కు సంబంధించిన చిమ్నీల ద్వారా వచ్చే వేడి ఆవిరి వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి అవుతున్నారని,అనుమతి లేకుండా వంట గ్యాస్ సిలిండర్ల మార్పిడి పెద్ద ఎత్తున చురుకుగా సాగుతుందన్న విషయం గమనించడం జరిగిందన్నారు.అగ్ని మాపక వాహనము కూడా వెళ్ళలేని ఆ ఇరుకు సందుల్లో గ్యాస్ మార్పిడి వల్ల అనుకోని ప్రమాదం జరుగుతే అక్కడ నివసించే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న సంగతి గమనించి ఇట్టి విషయమై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం వాటిల్లక ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గుట్టమీది నరేందర్,గోరుకంటి విఠల్,ఉపేందర్నాథ్ రెడ్డి, సంఘం శ్రీకాంత్, కీర్తి లత గౌడ్, మాల్యాద్రి నాయుడు,బండమీది మల్లేష్, కిరణ్ యాలాల, కృష్ణ రాజీ, సుమనళిని,భాను చందర్,కందాట ప్రవీణ్, రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.