ముద్ర ప్రతినిధి, జడ్చర్ల: అపాయము జరిగినా,ఎలాంటి ఆపదలు వచ్చినా 100 కు ఫోన్ చేయాలని పోలీసులు పదేపదే చెబుతుంటారు.అదే 100కు ఫోన్ చేయడంతో ఒక ప్రాణం నిలబడింది.వివరాల్లోకి వెళితే జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి భార్యతో గొడవ పడంతో గత కొంతకాలంగా భార్య తన పుట్టింటి దగ్గర ఉంటుంది. అయితే మంగళవారం భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ ద్వారా తన భార్యకు సమాచారం ఇచ్చాడు.దీంతో మహేష్ భార్య తన ఆడబిడ్డకు ఫోన్ ద్వారా తెలుపగా హైదరాబాద్లో ఉంటున్న మహేష్ చెల్లెలు జడ్చర్ల పోలీస్ 100 కాల్ చేశారు.దీంతో జడ్చర్ల సిబ్బంది ఫోన్ చేయగా 100 డైల్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సత్యపాల్ మరియు జనార్దన్ ఇరువురు జడ్చర్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమలాకర్ ఆదేశాల మేరకు మహేష్ ఫోన్ యొక్క లొకేషన్ కనుక్కొని అతని దగ్గరికి వెళ్లి అతను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడడం జరిగింది. దీంతో మహేష్ కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నాడు.