Take a fresh look at your lifestyle.

జిల్లా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు నిబంధనలు పాటించాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో నూతన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వ శాఖల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు. నూతన జిల్లా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమంగా జీతాలు, ఈఎస్ఐ, పిఎఫ్ ఇతర సౌకర్యాలను తప్పకుండా అందించాలన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించని ఏజెన్సీలను బ్లాక్లిస్టులో పెట్టి, వేరే ఏజెన్సీలకు అందిస్తామన్నారు. జిల్లా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రామరాజు, జిల్లా విద్యాధికారి శ్రీరామ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి, లేబర్ ఆఫీసర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.