ముద్ర, కోరుట్ల;
తెలంగాణ రాష్ట్ర వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ ఇంత పెద్ద పదవిని అందించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సత్సంబంధాలు కలిగి ఉండి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసీ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. కోరుట్ల, మెట్పల్లి కి చెందిన మున్సిపల్ చైర్మన్ లు తిరుమల వసంత గంగాధర్, మైలారపు లింబాద్రి, పార్టీ నాయకులు, కార్యకర్తలు జువ్వాడి నర్సింగరావు కు అభినందించి, శాలువాతో సన్మానించారు.