ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొని అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వేం నరేందర్ రెడ్డి ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగాలని తమ ఆశీస్సులు తెలిపారు.