- సంస్థ ఛైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్.బలరామ్.
- అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన డైరక్టర్(పా) గౌతమ్.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి భవన్ నుండి బుధవారం నాడు సింగరేణి అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంస్థ ఛైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్.బలరామ్,డైరక్టర్(పా) గౌతమ్ పొట్రు లు సంస్థ కార్మికుల కు సంబంధించిన అంశాలపై సమీక్షను నిర్వహించారు.ఈ సంధర్భముగా సంస్థ ఛైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్.బలరామ్, డైరక్టర్(పా) గౌతమ్ పొట్రు, పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారుల తో కార్మికులకు సంబంధించిన సమస్యలను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని, త్వరితగతిన పూర్తి చేయకపోతే ఉపేక్షించేది లేదని,విధులకు గైర్హాజరు అయ్యే కార్మికులు సక్రమంగా విధులకు హాజరయ్యే లా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.అనంతరం డైరక్టర్(పా) గౌతమ్ పొట్రు,11 ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధిపతులతొ ఏరియాల వారీగా విధులకు గైర్హాజరు అవుతున్న ఉద్యోగులకు తీసుకునే క్రమశిక్షణాచర్యలపై, కారుణ్య నియామకాల ద్వారా నియామకమైన మహిళా ఉద్యోగులకు నిర్ధిస్టమైన పనులను కేటాయించే విషయం పై,పదవీ విరమణ పొందే ఉద్యోగుల సిఎంపిఎఫ్,పెన్షన్ క్లెయిమ్,గ్రాట్యుటీ,సిపిఆర్‌ఎంఎస్ మెడికల్ కార్డులు,కారుణ్య నియామకాలు ఏరియాల వారీగా గల క్వార్టర్స్ వివరాల వంటి అంశాలపై సమీక్షించారు.అలాగే కార్మికుల సంక్షేమనికి సంబంధించి ఎటువంటి పైల్స్ పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.కార్మిక సంక్షేమం విషయం లో ఎటువంటి నిర్లక్షం వహించకూడదు అని చెప్పారు.ఈ సమీక్షా సమావేశం లో సింగరేణి భవన్ నుండి ఛైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్.బలరామ్, సింగరేణి ప్రధాన కార్యాలయం నుండి డైరక్టర్(పా) గౌతమ్ పొట్రు లతో పాటు జిఎం(పర్సనల్) ఇర్ పిఎం కవితా నాయుడు, జిఎం (పర్సనల్) ఆర్‌సి బెనెడిట్ట్ నికోలస్,జిఎం(పర్సనల్) వెల్ఫేర్, సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్, జిఎం(పర్సనల్) ఈఈ సెల్ ఏజేఎం మురళీధర రావు, ఏజిఎం(పర్సనల్) జి.రాజేంద్ర ప్రసాద్,డిజిఎం(పర్సనల్) లు కే.అజయ్ కుమార్,కేసా నారాయణ రావు 11 ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధిపతులు, సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.