మంథని, ముద్ర: మంథని నియోజకవర్గంలో మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు.మంథని పట్టణంలో శ్రీపాద చౌక్, రావులచెరువు కట్ట వీధి,ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీపాద రావు విగ్రహాలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు,హాస్పటల్ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. మంథని బస్టాండ్ లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి,13వ వార్డు లో చలివేంద్రాన్ని ప్రారంభించారు.మంత్రి క్యాంప్ కార్యాలయంలో వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ,మాజీ ఎంపీపీ శంకర్, కిరణ్,మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిలి ప్రసాద్, శశిభూషన్ కాచే, కార్యకర్తలు పాల్గొన్నారు.