- అంగన్వాడి సెంటర్స్ కు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి
ముద్ర,వీపనగండ్ల: విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని సిపిఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి డిమాండ్ చేశారు.సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గ్రామస్థాయిలో ప్రజలు విద్యార్థులు చదువుకున్న సమస్యలపై సర్వే నిర్వహించారు.అందులో భాగంగా మండల పరిధిలోని గోపాల్ దీన్నే లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాఠశాల అంగన్వాడీ సెంటర్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.గ్రామంలోని యుపిఎస్ పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిండగా కేవలం ముగ్గురు ఉపాధ్యాయులతోనే కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని, తాత్కాలికంగా నైనా విద్యా వాలంటీర్ నియమించి విద్య బోధన కొనసాగించాలని,వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియమించాలని అన్నారు.గ్రామంలో రెండు అంగన్వాడీ సెంటర్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని,దీనితో టీచర్లకు,చిన్నారులకు ఇబ్బందులతో పడటం లేదని,మూత్ర శాలలు కూడా లేవని,ప్రభుత్వం వెంటనే అంగన్వాడి సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని బాల్ రెడ్డి డిమాండ్ చేశారు.సమస్యలు పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పోగుల వెంకటయ్య,రంగస్వామి గౌడ్, పేట రాముడు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.