బోడుప్పల్, ముద్ర విలేకరి: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉత్తమ సేవలు, నిబద్ధతకు గాను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎ.శైలజ ఉత్తమ అదికారిగా అవార్డు అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ మను చౌధరి చేతుల మీదుగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం అందుకున్నారు. అలాగే ఉత్తమ పారిశుధ్య సేవలకు గాను శానిటరీ ఇన్ స్పెక్టర్ బి. నారాయణ రెడ్డి, వార్డ్ స్థాయిలో ఉత్తమ సేవలకు గాను సరిత, వార్డ్ ఆఫీసర్ లకు ఉత్తమ సిబ్బందిగా ప్రశంసాపత్రాలు అందించారు.
క్రికెట్ విజేతగా బోడుప్పల్ కార్పొరేషన్ టీం

100 రోజుల కార్యాచరణ అమలులో భాగముగా పీర్జాదిగూడ కార్పొరేషన్లో నిర్వహించిన క్రికెట్ కప్ -2025 లో బోడుప్పల్ నగర పాలక సంస్థ టీమ్ విజేత గా నిలిచింది. 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బోడుప్పల్ నగర పాలక సంస్థలో ట్రోపీని కమిషనర్ ఎ.శైలజ క్రీడాబృందానికి అందించారు. ప్రధమ బహుమతి గెలిచిన సందర్బంగా టీమ్ సభ్యులను అభినందించారు.