- జర్నలిస్టులపై కేంద్రం వివక్ష
- పాత్రికేయ వృత్తి విశిష్టతను తగ్గించేలా నిర్ణయాలు
- జర్నలిస్టలు అంటే ఎవరో కేంద్ర ప్రభుత్వం పునర్ నిర్వచనం చెప్పాలి
- విలువలతో కూడిన జర్నలిజం అవసరం
- ఐజేయూ మాజీ జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ దేవులపల్లి
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: జర్నలిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవ హరిస్తున్న తీరు ఆక్షేపనీయంగా ఉన్నదని ఐజెయు మాజీ జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ ఆందోళన వ్యక్తం చేశారు.దశాబ్ధాలుగా కొనసాగుతున్న జర్నలిస్టుల చట్టాలను రద్దు చేసి పాత్రికేయ వృత్తికి ఉన్న విశిష్టతను తగ్గించే చర్యలకు పూనుకుంటున్న తీరుపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్ మరియు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మహాసభలు మంగళవారం శంకర్‌పల్లి సమీపంలోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐజెయు మాజీ జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఐజెయూ కార్యదర్శి వై నరేందర్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కిం గ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు విరాహత్ అలీ, కార్యదర్శి రాం నారయణ, బీఆర్ ఎస్ జాతీయ అధికార ప్రతినిధి పీ కార్తీక్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజర య్యారు.
ఈ సంద ర్భంగా ఐజెయు మాజీ అధ్య క్షుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ..70 ఏళ్ల కిందట జవహర్‌లాల్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు గౌరవం,స్వేచ్ఛతో కూడిన ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న చట్టాలను నేడు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం శోచనీయమన్నారు.ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న పాత్రికేయ రంగం విలువలను తగ్గిస్తూ జర్నలిస్టులను సైతం కార్మికుల చట్టాల పరిధిలోకి తీసుకురావడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని ఆక్షేపించారు.జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా వారి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా నేడు దేశమంతటా మీడియాలోప్రతికూల పరిస్థితులు నెలకొనడం విచారకరమన్నారు.కొత్తగా ప్రయోజనాలను ఆశించడం అటుంచితే,చివరకు ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూవస్తున్న వృత్తిపరమైన హక్కులను కూడా నేడు పాత్రికేయులు కోల్పేయే ప్రమాదంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు అంటే ఎవరో కొత్త నిర్వచనం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అమర్ డిమాండ్ చేశారు.పాలకపక్షాల తీరు ఇలా ఉంటే పత్రికా యాజమాన్యాలు కొత్త చట్టాలను, టెక్నాలజీని అడ్డుపెట్టుకొని రెగ్యులర్ ఉద్యోగాలకు బదులుగా కాంట్రాక్టు పద్ధతిని తీసుకురావడం,ఉన్న జర్నలిస్టుల తొలగింపు చర్యలకు పూనుకుంటున్నాయని దుయ్యబట్టారు.దీంతో నేడు వేలాది మంది జర్నలిస్టులకు ఉపాధి లేక నిరుద్యోగులుగా మారిపోవాల్సిన దుస్థితి తలెత్తుతోందన్నారు.జర్నలిస్టులకు ఉన్న స్వేచ్చను,గౌరవాన్ని కాపాడుకునేందుకు పోరాటాలు ఒక్కటే మార్గమని,ఈ విషయంలో పాలకపక్షాలు దిగివచ్చేదాకా మిగతా రాజకీయ పక్షాల మద్దతును తీసుకొని ముందుకుపోవాలని సూచించారు.ఈ నేపథ్య్ంలో ఉద్యోగం కాపాడుకుంటూ ఉపాధిని పొందడానికి మారుతున్న కాలానికి అనుగూనంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన గురుతర బాధ్యత నేడు పాత్రికేయులపై ఉందన్నారు.ఎప్పటికప్పడు అప్‌డేట్ కాకపోతే సమయానుకూలంగా సమాచార సేకరణ,వార్తలను రాయడంలోనూ ఇబ్బందులు తప్పవని,దీంతో వృత్తిపరంగానూ వెనుకబడిపోయే ప్రమాదం ఉందన్నారు.జర్నలిస్టల ఇళ్ల స్థలాలు,ఇతరత్రా మౌలికమైన సమస్యలపై ప్రభుత్వాలు సానూకూలంగా స్పందించాలని,లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలకు పాత్రికేయులు సిద్ధంగా ఉండాలని దేవులపల్లి అమర్ సూచించారు.
- గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడేది వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) ఒక్కటే….
గల్లీ నుంచి ఢిల్లీ దాకా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పోరాడేది.. పాత్రికేయ వృత్తి విలువలను కాపాడేది ఒకే ఒక సంఘం అది వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) మాత్రమేనని దేవులపల్లి అమర్ స్పష్టం చేశారు.అయితే ఎప్పటికప్పడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని విలువలతో కూడిన జర్నలిజంను అనుసరించినపుడే పాత్రికేయులకు సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని ఆయన సూచించారు.జర్నలిస్టుల హక్కులు, సంక్షేమంతో పాటు వృత్తిపరమైన విలువలను కాపాడే లక్ష్యంతో 68 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటైందని, నాటి నుంచి నేటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాత్రికేయుల పక్షానా రాజీలేని పోరాటం చేస్తున్నది,ఈ ఒక్క యూనియన్ మాత్రమేనన్నారు.తెలంగాణ ఉద్యమంలోనూ తమ యూనియన్ ముందు భాగాన ఉండి పోరాడిందని,ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉన్నందున ప్రత్యేకంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరంను ఏర్పాటు చేసింది కూడా తామేనని స్పష్టం చేశారు.అయితే కొందరు ఆ ఫోరంను తమకు తాముగా అనుకూలంగా మల్చుకొని సంఘంగా తెరపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినా జర్నలిస్టుల ప్రధానమైన సమస్యలను పరిష్కరించలేకపోయారని విమర్శించారు.తాను,నేడు తెలంగాణ ప్రెస్ ఆకాడమీ చైర్మన్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గతంలో రెండు పర్యాయాలు పదవులు పొందినా ఏనాడు నాటి పాలకపక్షాలకు వత్తాసు పలుకలేదని,వారి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనలేదని, జర్నలిస్టుల ప్రతినిధులుగానే వారి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయించామని అమర్ స్పష్టం చేశారు.
ఐజేయూ కార్యదర్శి నరేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్టేట్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ పుట్టగొడుగుల్ల అనేకమంది జర్నలిస్టులమని చెప్పుకొని తిరుగుతూ వ్యవస్థ ను పలుచన పడేస్తున్నారని ఆయన అన్నారు,ఇట్లాంటి వాటిపై జర్నలిస్టులు దృష్టి కేంద్రీకరించ వలసిన అవసరం ఉన్నదని ఆయన పిలుపు నిచ్చారు. జర్నలిస్టుల వ్యతిరేక విధానాలకు పాల్పుడుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ దాకా పోరాటం కొనసాగించాలని సూచించారు.జర్నలిస్టుల కోసం నిలబడి పోరాడే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ను మరింత బలోపేతం చేయాలని,ఇందుకోసం మండల స్థాయి నుంచి సభ్యత్వాలను నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.ఏ ఇతర జర్నలిస్టుల సంఘాలతో మన సంఘానికి పోలిక లేదని, రాజకీయాలతో మనకు సంబంధం లేదని, ఎవరు అధికారంలో ఉన్నా ఐక్య పోరాటాలతోనే పాత్రికేయుల సమస్యలను పరిష్కరించుకుందామన్నారు.
బీఆర్ ఎస్ జాతీయ అధికారి ప్రతినిధి పీ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు, రాబోయే రోజుల్లో అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టితో ఆలోచన చేసేందుకు బాధ్యత తీసుకొని మీకు అండగా నిలబడతానని ఆయన జర్నలిస్టులకు భరోసా కల్పించారు,జిల్లాలోని జర్నలిస్టులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా రక్షణకు అవ సర పడిన ప్రీమియమును అందజేసిన భారత రాష్ట్ర సమితి జాతీయ స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డికి జిల్లా కార్యవర్గము కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్య క్రమంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, జాతీయ రాష్ట్ర జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

