Take a fresh look at your lifestyle.

పార్టీ కోసం కష్టపడే వారికే సముచిత స్థానం బండి రమేష్

 

ముద్ర  కూకట్ పల్లి :

కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు, యువతకు, మహిళలకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

భవిష్యత్తులో పెరగనున్న నియోజకవర్గాలు, డివిజన్ల నేపథ్యంలో నిబద్ధతతో పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారికే పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుంది.

యువతను ప్రోత్సహించి వారికి తగిన అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుంది అని అయన అన్నరు.​ఈ సమావేశంలో

నాయకులు ఎండి మోయిజ్, రాష్ట్ర ఇంచార్జ్ భవ్య, రమ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు బొమ్మక అజయ్, ఇంచార్జులు రామ్ రెడ్డి, హరి ప్రసాద్, సల్మాన్, సలీం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.