Take a fresh look at your lifestyle.

అమ్మవారి బోనాలు ఎత్తుకున్న చిన్నారులు

యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: స్తానిక శ్రీవాణి పాఠశాల విద్యార్థులు శనివారం బోనాల జాతర నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఉదయం పాఠశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో పాఠశాల చిన్నారులు శివ సత్తులు, పోత రాజుల వేషాదారణలతో అమ్మవారి బోనాలు ఎత్తుకుని పోచమ్మ తల్లి గుడికి వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ బోనాల జాతరలో పాఠశాల కరస్పాండెంట్ జి.లక్ష్మణ్ కుమార్, ఆయన సతీమణి భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ మానస, శివకృష్ణ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.