ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి
సుప్రీంకోర్టు అడ్వకేట్, రిటైర్డ్ జడ్జి, శ్రీ వాసవి సేవా సమితి జాతీయ లీగల్ అడ్వైజర్ నేరెళ్ల మాలి యాద్రి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 36 వ వార్డులో శ్రీ వాసవి సేవా సమితి నూతన జిల్లా కార్యాలయాన్ని శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో చూపిస్తున్న కులస్తులు ఆర్యవైశ్యులని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆర్యవైశ్యుల పాత్ర వెలకట్టలేనిది అన్నారు . నిరుపేదల కష్టాలు బాధలు చూసి చదివించే మనసు ఉన్న ఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందు వరుసలో ఉన్నారన్నారు. శత్రువులంటూ లేకుండా జీవనం సాగించే ఆర్యవైశ్యులు ఎందరికో ఆదర్శం అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ తమ మతం కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి వెనకాడ బోరని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు దేవాలయాలకు తీసుకువెళ్లాలని దీని ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయం భవిష్యత్ తరాలకు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు చెట్లను నాటుతూ వాటిని సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. కరోనా సమయంలో శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణపట్నం సంబంధించిన మందును 30 వేల కు పైగా కుటుంబాలకు అందించామని సందర్భంగా గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉంటూ ఏ చిన్న సమస్య ఉన్న పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, కే శ్రీనివాసరావు,కాంగ్రెస్ నాయకులు ఫరూక్, గౌరవ చైర్మన్ ఈగ దయాకర్ గుప్తా, జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, గౌరవ సలహాదారులు గోపారపు రాజు, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్ సహాయ కార్యదర్శులు బచ్చు శ్రీనివాస్ ,సోమ సుమన్, తప్సి అనిల్ కుమార్, కోటా శివ, కర్నాటి కృష్ణ , బొల్లం సురేష్ ,సభ్యులు కొండ అనిల్ కుమార్, శ్రీరంగం రాము, సోమ ధనుంజయ్, మనసాని నాగేశ్వరరావు,మిట్టపల్లి రమేష్, బెలిదే శ్రీనివాస్, మంచాల శ్రీనివాస్, చందా రాజశేఖర్ , గుడిపాటి రమేష్ వెంపటి శబరినాథ్, తల్లాడ రాము,బుక్క రమేష్, బచ్చు నీరజ, తెడ్ల పల్లవి,ఉప్పల0చు కృష్ణ,మహంకాళి సోమయ్య పాల్గొన్నారు.