ముద్ర, మోత్కూర్:
రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూర్ నియోజకవర్గ సాధన కోసం ఈ ప్రాంత బిడ్డగా తాను ముందుంటానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.

గురువారం మున్సిపల్ కేంద్రంలోని ఎల్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మోత్కుర్ నియోజవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో మోత్కూర్, గుండాల, అడ్డ గూడూరు, ఆత్మకూర్ మండలాల చెందిన అన్ని రాజకీయ పక్షాల నాయకులతో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే మందుల సామెల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తాను ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడే చదివానని ఈ ప్రాంతం పై మక్కువతో మొక్కు నియోజకవర్గ సాధన కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేసినందుకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు గతంలో నియోజకవర్గాల లో మోత్కూర్ అడ్డగూడూర్ మండలాలు తుంగతుర్తి లో కలవగా ఆత్మకూరు గుండాల మండలాలు ఆలయ నియోజకవర్గంలో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి రాజకీయ ఆస్తిత్వం కొంతమేరకు దెబ్బతింది అన్నారు. ఇకనైనా మోత్కూర్ నియోజకవర్గం సాధించుకునేందుకు మంత్రులు, సీఎం రేవంత్ వద్దకు తన ఆధ్వర్యంలో తీసుకెళ్లి స్వయంగా ఒప్పించి నియోజకవర్గాన్ని సాధిద్దాం అన్నారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమ కారులు,పాత్రికేయులు, పలు సంఘాల నాయకులు నియోజకవర్గ సాధన పై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.పార్లమెంట్ లో బిల్లు పాస్ అనంతరం డీ లిమిటేషన్ కమిటీ తో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కి వినతి పత్రాలు అందించాలన్నారు.