Take a fresh look at your lifestyle.

సింగరేణిలో సాధారణ మరణాల కు 25 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

  • యాజమాన్యం కు లేఖ రాసిన గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి లో మైన్,రోడ్ ఇతర ప్రమాదాలలో మరణించిన కార్మికులకు ఏఐటియుసి విజ్ఞప్తి మేరకు సింగరేణి యాజమాన్యం కోటి నుండి కోటి 25 లక్షల వరకు బ్యాంకులతో అగ్రిమెంట్ చేసి చెల్లిస్తున్న విషయం కార్మికులకు తెలిసిందే! కానీ సాధారణ మరణాలు,వివిధ జబ్బుల కారణాల వలన సంవత్సరానికి సుమారు 200 మంది వరకు మరణిస్తున్నారని యాజమాన్యం లెక్కలు చెబుతున్నాయని వారి కుటుంబాలకు కూడా ఆర్థిక ప్రయోజనం ఇప్పించాలని గుర్తింపు సంఘం ఏఐటియుసి యూనియన్ యాజమాన్యంతో మాట్లాడి సాధారణ లేక ఇతర కారణాలతో మరణించినవారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సింగరేణి యాజమాన్యంకు లేఖ రాసి దీనిపై యాజమాన్యంతో చర్చిస్తున్నాము యాజమాన్యం బ్యాంకులతో మాట్లాడగా పంజాబ్ నేషనల్, ఎస్బిఐ బ్యాంకుల కాకుండా ఇతర బ్యాంకులతో చర్చిస్తుంది. ఏఐటీయూసీ యూనియన్ ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడ చర్చించి సాధారణ ఏదేని జబ్బుల ద్వారా మరణించినకుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించడానికి ప్రయత్నం చేస్తుందని,ఈ ప్రయత్నం త్వరలో ఫలిస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.