Take a fresh look at your lifestyle.

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి

 

ముద్ర, కరీంనగర్:

 

*డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారత దేశంలో విశిష్టమైన పాత్ర పోషించారని మరియు వారు చేసిన సేవలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి‌నరేందర్ రెడ్డి గారు వారి వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా మరియు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా అనేక సేవలు అందించారని మరియు వారి యొక్క పరిజ్ఞానంతో ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల యొక్క శ్రేయస్సు కోరిన గొప్ప రాజనీతిఘ్నుడని కొనియాడారు. వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మరియు ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకొని విద్యార్థులకు ఎన్నో విధాలుగా సేవలను అందించి ఉత్తమమైన స్థానాలలో స్థిరపరచి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు‌ వారు చేసిన సేవలకు మరియు రూపొందించిన పథకాలకు భారతదేశ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించి మరియు వారి జన్మదిన ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని వారు చెప్పారు.
వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్ గా పనిచేసి విద్యా మరియు జీవితం యొక్క ప్రాముఖ్యతను తన యొక్క మాటల ద్వారా తెలిపి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో విజయవంతులైనారని చెప్పవచ్చు. భారత రాయబారిగా ఆయన చేసిన సేవలు చాలా సమాజహితమైనవని, హిందూ వేదాంతాన్ని పాశ్చాత ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప తత్వవేత్తని కొనియాడారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇతర దేశాలకు రాయబారిగా పనిచేసి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని స్వస్తిరపరచి ఎన్నో సేవలు చేశారని వారు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని మరియు వారి శ్రమించిన తీరు చాలా ప్రేరేపించదగినదని అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.