ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ నియోజకవర్గంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియామిస్తూ టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మెదక్ టౌన్ అధ్యక్షులుగా మందుగుల గంగాధర్, రామాయంపేట టౌన్ అధ్యక్షురాలుగా చింతల స్వప్న,మెదక్ మండల అధ్యక్షులుగా మార్గం నాగరాజు, హవేలీ ఘన్‌పూర్ మండల అధ్యక్షులుగా గుండారం కిరణ్ గౌడ్, పాపన్నపేట మండల అధ్యక్షులుగా నరేందర్ గౌడ్, చిన్న శంకరంపేట మండల అధ్యక్షులుగా మోహన్ నాయక్, రామాయంపేట మండల అధ్యక్షులుగా బండారి మహేందర్ రెడ్డి, నిజాంపేట్ మండల అధ్యక్షులుగా యెల్దుర్తి వెంకటేష్ లను నియమించారు. ఈ నియామకాలు మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సూచనతో ప్రకటించారు. తమ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్, సీనియర్ రాష్ట్ర నాయకులు హన్మంత్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
