రామకృష్ణాపూర్, ముద్ర : భారతీయ జనతా పార్టీ 46 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణ భాజపా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.స్థానిక సూపర్ బజార్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ధన్ సింగ్,సూపర్ బజార్ చౌరస్తాలో సీనియర్ నాయకులు పోషం,రాజీవ్ చౌక్ చౌరస్తాలో మాజీ అధ్యక్షుడు వేముల అశోక్ జెండాను ఆవిష్కరించారు.అలాగే వివిధ బూతులలో అధ్యక్షులు జెండాలను ఎగురవేశారు.సీనియర్ నాయకులు వేణుగోపాల్,ఈశ్వర చారి,రామ్ కిషోర్,శ్రీనివాస్,కళాధర్ రెడ్డి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.