ముద్ర, గద్వాల జిల్లా ప్రతినిధి:
ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో బదిలీలు, ఉద్యోగ విరమణలు సర్వసాధారణమని విశ్రాంత ఉద్యోగులు తమ శేష జీవితంలో కొంత సమయాన్ని సమాజ సేవకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.
జిల్లా యువజన క్రీడల అధికారిగా పనిచేసి పదవి విరమణ పొందుతున్న డివైఎస్ఓ కృష్ణయ్య ను సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణయ్య తన ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేశారని, భవిష్యత్తులో జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన సేవలు అవసరమైతే వినియోగించుకుంటామన్నారు. కృష్ణయ్య శేష జీవితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని, ఆరోగ్యంగా జీవించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం కృష్ణయ్యను జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, తదితరులు