ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్ను చెల్లించకుండా ఉన్న మొండి బకాయి దారుల కోసం మున్సిపల్ అధికారులు తమ దైన శైలిలో చెత్త సేకరణ వాహనాలతో పెట్రోల్ బంకు ముందు నిరసన తెలియజేశారు. విలేమున్ చౌరస్తా దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ యజమాని గత ఐదు సంవత్సరాల నుండి సుమారుగా 82 వేలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. ఆస్తి పన్ను చెల్లింపుకై పలు మార్లు నోటీసులు పంపించిన స్పందించకపోవడంతో సోమవారం రోజున మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి పెట్రోల్ బంక్ ముందు చెత్త సేకరణ వాహనాలతో పెట్రోల్ బంకును చుట్టూ ముట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, గడువులోగా పన్నులు చెల్లించి మునిసిపల్ అభివృద్ధికి సహకరించాలని లేనిచో వారి ఆస్తులు జప్తు చేసేందుకు వెనుకాడబోమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.