ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యాలాల మండలం అక్కంపల్లి గ్రామంలో లొంక నర్సింహులు యువసేన ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాములు మాట్లాడుతూ చూపులేని అభాగ్యుల కోసం నిరంతరంగా, ఎన్నో గ్రామాల లోన శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి చూపును ప్రసాదింప చేసేందుకు తన వంతుగా ముందుకు వచ్చి కృషి చేస్తున్న లొంక నర్సింలు సేవలు అభినందనీయమని ఆయన కొనియడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, ఆసుపత్రి సిబ్బంది, లొంక నర్సింహులు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.