ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది
ముద్ర, వనపర్తి : మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వనపర్తి పురపాలిక పరిధిలోని మర్రికుంట పోలింగ్ కేంద్రం 9వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా, బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అర్హులైన వారందరూ నిర్దేశించిన గుర్తింపు కార్డులు తీసుకొని, పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేసి, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.

అదేవిధంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు, ఓటర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.