ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: పరిసరాలలో నిలువ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకో వాలని రామగుండం,నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి ప్రజలకు అవగాహన కల్పించారు.వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం డివిజన్ లలో డ్రై డే – ఫ్రై డే నిర్వహించి గోళాల్లో,పాత టైర్లలో,కొబ్బరి చిప్పలలొ నిలువ ఉన్న నీటిని తొలగించారు.ఈ సంధర్భంగా వెంకట్రావ్ పల్లి లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నిలువ ఉన్న నీటిలో దోమల లార్వా పెరగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. దోమ కాటు బారిన పడకుండాజాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.స్థానిక పల్లె దవాఖాన సందర్శించి జ్వర పీడితుల వివరాలను సేకరించారు. జ్వర పీడితులు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి తో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.కాగా వంద రోజుల ప్రణాళికలో భాగంగా పలుడివిజన్ లలో పిచ్చి చెట్లు,పొదలు తొలగించారు.నిలువ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేశారు. ఫాగింగ్ చేశారు.ప్రజా మరుగు దొడ్లు పరిశుభ్రం చేశారు.టైల్ఎండ్ ప్రాంతాల్లో త్రాగు నీటికి క్లోరిన్ పరీక్షలు నిర్వహించారు. గోదావరిఖని బస్ స్టాండ్ ఏరియా పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర పాలక సంస్థ సానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం,కిరణ్,మెప్మా సి ఓ ఊర్మిళ,ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్,ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్,వార్డు అధికారులు,ఆర్ పి లు,స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.
