ముద్ర మల్కాజ్గిరి:
ఉప్పల్‌లో 6 మే 2026న జరిగే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోల్–హబ్సిగూడ, బోడుప్పల్–అంబర్‌పేట్ మార్గాల్లో రద్దీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. లారీలు, డంపర్లు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్లు వంటి హెవీ వాహనాలను వివిధ జంక్షన్ల వద్ద ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తారు. ఉప్పల్ స్టేడియం వద్ద ప్రేక్షకుల కోసం నాలుగు సాధారణ పార్కింగ్ ప్రదేశాలు, పాస్ హోల్డర్లకు స్టేడియం లోపల ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ముందుగానే ప్రయాణ ప్రణాళిక చేసుకుని వీలైనంతవరకు బస్సులు, మెట్రో రైలు వంటి ప్రజా రవాణా సేవలను వినియోగించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్–II, మల్కాజిగిరి విజ్ఞప్తి చేశారు.