Take a fresh look at your lifestyle.

హుజూర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

 

ముద్ర ప్రతినిధి , కోదాడ …..

హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద నూటా పది ఎకరాలలో నిర్మిస్తున్న రెండు వేల నూటా అరవై ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని, అంతర్గత రోడ్లు, సభాస్థలిని, మొక్కలు నాటే స్థలాన్ని , హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ ల అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హత లేని వారికి ఈ జాబితాలో పేరు ఉండకూడదని అని స్పష్టం చేశారు. అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి, నిశితంగా పరిశీలించి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ , హౌసింగ్ పీడీ సిద్ధార్థ , జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య , మిషన్ భగీరథ అధికారి
కరుణాకర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ , తహసిల్దార్ కవిత , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.