Take a fresh look at your lifestyle.

కేంద్రం మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం. 

 

ముద్ర ,మోత్కూర్:    తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటి పై బిజెపి శ్రేణుల దాడికి నిరసనగా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో  కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండగొని రామచంద్రు గౌడ్ ఆధ్వర్యంలో  బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు .ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఫైళ్ళ సోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీనర్సింహా రెడ్డి మాట్లాడుతూ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి మందుల సామెలు అని ఎమ్మెల్యే మందుల సామేల్ ఎదుగుదలను చూసి ఓర్వలేక బిజెపి నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన అల్లరి మూకలను దళిత ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటి పై దాడి చెయ్యడం పిరికిపందా చర్య అని అన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గానగని శైలజ నర్సింహా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ పెలపూడి వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి మందుల సురేష్,మెంట నగేష్,కుర్మిళ్ళ రాములు, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు సుంకిశాల అనిల్, యాదయ్య,భగవంత్, గుండు శ్రీను, పల్లపు సమ్మయ్య,ఎడ్ల శ్రీను, సోషల్ మీడియా కన్వీనర్ పాలోజు శేఖరా  చారి,మున్నీరు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.