ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం అమలుకు నోచుకోలేని పథకాలు ఇస్తామని చెప్పి నెరవేర్చడంలో విఫలం చెందిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం భువనగిరి పట్టణ, మండల అధ్యక్షులు రత్నపురం బలరాం, చిరిక సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, డబుల్ బెడ్ రూములు, నిరుద్యోగ భృతి, చేయూత వితంతు,వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ 4000,6000,రైతు భరోసా, యువతకు జాబ్ క్యాలెండరు, మహిళలకు 2500, దళితులకు మూడు ఎకరాల పొలం ఇంకా ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉంటే బిజెపి కార్యకర్తలు ఊరుకోరని ప్రజలకు న్యాయం జరిగేంత వర పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి ,పట్నం శ్రీనివాస్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర పప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, సూర్వి శ్రీనివాస్ గౌడ్, పాదారాజు ఉమా శంకర్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కోళ్ల బిక్షపతి, మేడి కోటేష్, పంచద్దుల బలరాం, వంగేటి విజయభాస్కర్, సురేష్ గౌడ్, పట్టణ కౌన్సిలర్ యాస్మిన్ నాగేష్,పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, జనగాం కవిత, యంజాల మల్లిక, పట్టణ ఉపాధ్యక్షుడు యట వెంకటేష్, కొల్లోజు సతీష్, తాడూరి బాల శంకర్, ఉప సర్పంచ్ వెంకటేష్ నాయక్, జిల్లా కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహా రావు, రత్నపురం శ్రీశైలం, తాడూరి రాజు, నానాంచర్ల శివ, కారుపాటి రాజు, రాజు చారి, బండారు లోకేష్, గాయపాక పృద్వి, వెంకటేష్, సైదులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.