Take a fresh look at your lifestyle.

తెలంగాణలో త్వరలో విత్తన చట్టం

  • విత్తనం పండించడానికి తెలంగాణ అనువైన ప్రాంతం.
  • అందుకే మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడే మకాం వేస్తున్నాయి.
  • నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటు చేసినా రైతులకు మద్దతు ధర దక్కడం లేదు.
  • పక్కనే మహారాష్ట్రలో ధర ఎక్కువగా వస్తుంది.
  • పసుపు సాగులో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
  • ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రం విఫలం.
  • రైతు కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : త్వరలో నిర్దిష్టమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి చెప్పారు. విత్తనం పండించుకోడానికి తెలంగాణ అనుకూలమైన ప్రాంతమని, అందుకే మల్టీనేషనల్ కంపెనీలు అన్ని రకాల విత్తనాలను ఇక్కడ తయారుచేస్తున్నాయని అన్నారు.కంపెనీల వారు రైతులతో సంబంధం లేకుండా ఆర్గనైజర్లను పెట్టుకొని పనిచేస్తున్నారని అన్నారు. ములుగులో అమాయక రైతులను మోసం చేసిన ఘటన ఈ మధ్యకాలంలో వెలుగుచూసిందన్నారు. ఆర్గనైజర్లు మాత్రమే బాగుపడ్తున్నారని తెలిపారు. కమిషన్ ములుగులో పర్యటించి, కమిటీ వేసి రిపోర్ట్ తెప్పించిందన్నారు. కంక్కి తింటే పశువులు చనిపోయాయని, రైతులు- కూలీలు తింటే అనారోగ్య సమస్యలకు గురై, ఒక్కరిద్దరు చనిపోయారన్నారు.సింజెంటా కంపెనీ మోసాలు చాలావున్నాయని, మార్కెట్ ఫీజు కూడా కట్టకుండా మినహాయింపు తెచ్చుకున్నారని ఆయన తెలిపారు.ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో రైతు కమిషన్ సమావేశమైన విత్తన సమస్యలపై చర్చించింది. ఈ సమావేశంలో కోదండ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేసింది కానీ రైతలుకు న్యాయమైన ధర దక్కడం లేదన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌లో ధర ఎక్కువగా వస్తుందన్నారు. భూమిలో నుంచి పసుపు పీకడం, ఉడకబెట్టడం, పాలీష్ చేయడంలో యంత్రపరికరాలు అవసరమని ఆయన తెలిపారు. ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రానిదే బాధ్యత అని అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను పక్కన పెట్టి రైతుల కోసం కేంద్రం పనిచేయాలని ఆయన కోరారు.రాష్ట్రంలో ప్రాసెస్ ఇండస్ట్రీస్ కోసం కృషి జరగాల్సివుందన్నారు.ఒక బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను చేయవచ్చని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనం అందుబాటులో లేదన్నారు. 1966 లో కేంద్రం చేసిన విత్తన చట్టం, 2007 పత్తి విత్తన చట్టాలే వున్నాయని అన్నారు. వాటిలో లోపాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కొత్త విత్తన చట్టం రావల్సిన అవశ్యకత ఉందన్నారు.రైతు కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి రాష్ట్రంలో కల్తీ విత్తనం రాజ్యమేలుతుండటంతో వ్యవసాయం గాడి తప్పిందన్నారు. ఇతర దేశాల్లో సాంప్రదాయ పంటలకు ప్రాధాన్యత ఉందని, మన దేశంలో మాత్రం నిర్లక్ష్యం జరుగుతుందని అన్నారు. తెలంగాణలో కురుకుమిన్ ఎక్కవగా ఉండే పసుపు విత్తనం అవసముందన్నారు. పసుపు పంటకు ఎక్కవ ధర లభించాలంటే కురుకుమిన్ అధికంగా ఉండాలన్నారు. ఈ క్రమంలో పసుపురైతుకు మరింత ఊతం అందించాల్సి ఉందని ఆమె వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.