- నామినేషన్ వేయడానికి వాహనాలతో వెళ్లిన మంత్రులు
- తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సర్దార్ రవీందర్ సింగ్
- రెండు వర్గాల మధ్య బాహాబాహీ
ముద్ర ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల చివరి రోజు అభ్యర్థులు నామినేషన్లు వేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. స్వతంత్ర అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ నామినేషన్ దాఖలు చేసి బయటికి వస్తున్న క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ సమర్పించడానికి పీసీసీ ప్రెసిడెంట్,మంత్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయం లోపటికి వాహనాలలో వెళ్లారు. దీనిని గమనించిన సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో రెండు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ బాహాబాహీ కి దిగారు.పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నామినేషన్ల ప్రక్రియ యదావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.సామాన్యులకు ఒక న్యాయం అధికార పార్టీ మంత్రులకు మరో న్యాయం అంటూ సర్దార్ రవీందర్ సింగ్ విమర్శించారు.ఎన్నికల నియమాలని ఉల్లంఘించిన మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందాలని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.