Take a fresh look at your lifestyle.

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత  – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర  కాప్రా

కాప్రా డివిజన్ పరిధిలోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.కాప్రా ,శాంతి కాలనీలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన  సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ద్వారా రవాణా సమస్యలు తగ్గి, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. శాంతి విల్లే కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని పేర్కొన్నారు. కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తెచ్చే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్, కాలనీ వాసులు  పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.