Take a fresh look at your lifestyle.

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. హర్యానా గవర్నర్‌గా అషింకుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రవిందర్ గుప్తాలను నియమించారు. కాగా, ఇప్పటి వరకు హర్యానా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా తనకు గవర్నర్ పదవి దక్కడంపై అశోక్ గజపతి రాజు హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ పదవి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని అన్నారు. దేశానికి సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తానని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. అశోక్ గజపతి రాజు తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు విజయనగర సంస్థానపు చివరి మహారాజు. అయినప్పటికీ రాజరిక పోకడలకు దూరంగా ఉంటు నీతి నిజాయితీ గల ప్రజా నాయకుడిగా అశోక్ గజపతి రాజు గుర్తింపు పొందారు. 1978లో తొలిసారిగా జనతా పార్టీ నుంచి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అశోక్ గజపతి రాజు.. 1989లో టీడీపీలో చేరారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా పనిచేశారు. 2014లో కేంద్ర ప్రభుత్వంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హాయంలో ఎక్సైజ్, వాణిజ్య, ఆర్థి, రెవెన్యూ, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.