ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమం లో పాల్గొన్న మాజీ గవర్నర్ రాధాకృష్ణ మాట్లాడుతూ పరిశుభ్రత గురించి విద్యార్థులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామని,విద్యార్థులు తమ ఇంటిని, పాఠశాలను మరియు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో మాజీ గవర్నర్ రాధాకృష్ణ తో పాటు, మెంబెర్ షిప్ కో ఆర్డినేటర్ హకీమ్ విశ్వ ప్రసాద్, క్లబ్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కార్యదర్శి సురేష్ కుమార్, మాజీ అధ్యక్షులు పోల శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.