Take a fresh look at your lifestyle.

ఇండ్ల స్థలాల కోసం గడువును పొడిగించండి 13వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ శివశేఖర్

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి.:

జోగిపేట్ పట్టణ సీనియర్ నాయకులు పట్లూరి శివశేఖర్ 13వ వార్డు కౌన్సిలర్ అందోల్ తాసిల్దార్ గారికి ఇళ్లస్థలాల దరఖాస్తు గడవును పెంచవలసిందిగా కోరారు. అందోల్ తహసిల్దార్ గారు ఈనెల 20 నుండి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన విడుదల చేశారు. అందోల్ -జోగిపేట మున్సిపల్ పరిధిలో నివసించే అర్హులైన నిరుపేదలు దరఖాస్తు చేసుకునేందుకు,ఉగాది శ్రీరామనవమి,జోగినాద స్వామి జాతరలో ప్రజలందరూ నిమగ్ధమైనారు.పది రోజుల గడువు సరిపోదు. సంబంధిత ధ్రువపత్రాల కోసము ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుందని, ప్రజల అవసరాల దృష్ట్యా గడువును మరో 20 రోజులు పొడిగించాలని 13వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ పట్లూరి శివశేఖర్ తాసిల్దార్ గారికి విజ్ఞప్తి చేశారు.గతంలో బిఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో నెల రోజులు గడువును ఇచ్చి పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు.ప్రస్తుతం నిరుపేదలైన వారికి గడువును పొడిగించి ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.