Take a fresh look at your lifestyle.

బిజెపి పుట్టకముందే హిందుత్వం పుట్టింది – *పిసిసి ప్రధాన కార్యదర్శి, గజ్జల కాంతం

 బిఆర్ఎస్ బిజెపిలో విలీనం కాబోతోంది ఇది వాస్తవం

కరీంనగర్ మేయరు స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ 1000 కోట్లు తీసుకువచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

బిజెపిలో ఉంటేనే హిందువులు అన్నట్లుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రచారం

 

ఫిబ్రవరి 24, ఆర్ & బి అతిథి గృహం, కరీంనగర్

పీసీసీ ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం గారు నేడు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారితో పాటు పలువురు నేతలతో కలిసి కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథి గృహంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా గజ్జల కాంతం గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ

బిజెపి బిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు 20023లో గుణపాఠం చెప్పినప్పటికీ వారు కనీసం ఎలాంటి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు

బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేని స్థితికి దిగజారిపోయింది

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో బిఆర్ఎస్ అభ్యర్థి చిత్తుచిత్తుగా ఓడిపోయారు

సర్పంచ్ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు పాతర వేశారు

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అడ్రస్ ఎక్కడుందో వారికే తెలియాలి, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ రాష్ట్రంలో గెలుచుకున్న స్థానాలలో ఇండిపెండెంట్ లు మాత్రమే అధికంగా ఉన్నారు, బిఆర్ఎస్ జాడే లేదు

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి సరైన తీర్పు ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 16 గంటలకు ప్రజల కోసం పనిచేస్తున్నారు

సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు

బిఆర్ఎస్ బిజెపిలో విలీనం కాబోతోంది ఇది వాస్తవం

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో బిఆర్ఎస్ నేతలు చర్చలు తెలిపారు, కెసిఆర్ ను జైలులో వేయకుండా చూడాలని బీజేపీ, బిఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది

ఫోన్ టాపింగు ఈ ఫార్ములా రేస్ కేసులలో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి గవర్నర్ ఆమోదం తెలుపకపోవడం పట్ల ఇది స్పష్టమవుతుంది

అయినప్పటికీ ప్రతిపక్షాలు నీతిమంతులమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది

కెసిఆర్ కేటీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఆదరిస్తారు

బిఆర్ఎస్ పార్టీ మరో తెలుగుదేశం పార్టీగా ఈ రాష్ట్రంలో మారబోతుంది

టిడిపి లేకుండా చేసిన కేసీఆర్ పార్టీ కూడా బిజెపిలో విలనం కాబోతోంది

ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం నెహ్రూ గారు పది సంవత్సరాలు జైలు జీవితం గడిపినారు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు, కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పాలి

తెలంగాణ ప్రజలు విద్యార్థులు, అమరుల త్యాగాలను చూసి చలించిపోయి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, కెసిఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ దొంగలు

తెలంగాణ ఎస్సీ ఎస్ టి బిసి ఓసి మైనారిటీ అనివర్గాల ప్రజల పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కచ్చితంగా ఇవ్వవలసి ఉంటుందని గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు

తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించింది మేము, నాడు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ కు అనుకూలంగా లేక ఇప్పించింది మేము

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వక పోయి ఉంటే కెసిఆర్ కేటీఆర్ వందేళ్లు కొట్లాడిన తెలంగాణ రాకపోయేది, వారు ముఖ్యమంత్రి, మంత్రులు కాకపోయి ఉండేవారు

పార్లమెంట్ తలుపులు మూయించి తెలంగాణ ఇచ్చారని స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినారు

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ 3
ఎనిమిది లక్షల కోట్ల అప్పులు మిగిల్చి, మూడు లక్షల కోట్లు దోచుకుని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు

దుబాయ్ లండన్ అమెరికా ఇలాంటి విదేశాలలో నేడు కెసిఆర్ కుటుంబ సభ్యులకు వేలకోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలి

2014 కంటే ముందు కేసీఆర్ చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి కనీసం ఎకరం భూమి లేని కేసీఆర్ ఫామ్ హౌస్ ఇప్పుడు 600 ఎకరాలకు విస్తరించింది

కేటీఆర్ హరీష్ రావు లకు హైదరాబాద్ లో 100ల కోట్ల ఆస్తులు పెద్దపెద్ద భవనాలు బినామీల పేరుతో ఉన్నాయి

మా ముఖ్యమంత్రి గారు 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఒక్కరోజు కూడా కంటి నిండా నిద్ర పోవడం లేదు

కెసిఆర్ చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పు లకు వడ్డీలు కడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు

తొమ్మిదేళ్లు పరిపాలనలో కెసిఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు..?

మా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పేదలకు సన్న బియ్యం, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది

కెసిఆర్ నాడు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్ కు, ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు

ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే.

బిజెపిలో ఉంటేనే హిందువులు అన్నట్లుగా బండి సంజయ్ కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు

బిజెపి పుట్టకముందే హిందుత్వం పుట్టింది అనే విషయాన్ని వారు గమనించాలి

హిందువుల పేరుతో ఓట్లను దండుకోవడం వారిని మభ్య పెట్టడం తప్ప హిందువుల కోసం వారు చేసింది ఏమీ లేదు, ఇవి కాకుండా అభివృద్ధి ఏమి చేశారో అవి చెప్పాలి

ఒక్క మేయర్ సాధించడం వల్ల గొప్ప పని చేశామని అనుకోవద్దు,

నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈ రాష్ట్రానికి ఎందుకు నిధులు తీసుకురావడం లేదు, పక్క రాష్ట్రాలలో నాయకులు నిధులు తెచ్చుకుంటుంటే మన రాష్ట్రంపై మీకు సోయలేదా

రాముడు, హిందువు అనే నినాదాలు కాకుండా అభివృద్ధి గురించి బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు..?

ఏనాడు దుర్గామాత, సాయిబాబా, శివుడు దేవుల్ల గురించి మాట్లాడరు, వాళ్లు దేవుళ్ళు కారా..?

రాముని పేరుతో అసలైన హిందువులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు

మీరు అసలైన హిందువులు కారు హిందువుల పేరు మీద హిందువులను రెచ్చగొట్టి లబ్ది పొంది ఓట్లు దండుకోవాలని మీ ప్రయత్నం

హిందువుల కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లు తీసుకువచ్చారో అదే హిందువులకు సమాధానం చెప్పాలి

దమ్ముంటే 60 శాతం ఉన్న బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు తీసుకురావాలి,

నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా హిందువులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు నరేంద్ర మోడీ హామీ ఏమైంది.

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా హిందువులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు

కరీంనగర్ ప్రజలు మేయరుగా మీకు అవకాశం ఇచ్చినారు 1000 కోట్లు తీసుకువచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి

ఈ దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దేశ ప్రజల గురించి మాట్లాడే హక్కు ఉంది

దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన గాంధీని చంపిన గాడ్సే ను తమ దేవుడని చెప్పుకుంటున్న బిజెపి ఆర్ఎస్ఎస్

స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పత్తా లేదు

ఈ దేశం గురించి దేశ ప్రజల గురించి మాట్లాడే అర్హత బిజెపి ఆరెస్సెస్ కు లేదు అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆకరపు భాస్కర్ రెడ్డి, అకుల ప్రకాష్, గడ్డం నాగరాజు, క్యదాశు ప్రభాకర్, గజ్జెల ఆనంద రావు, ఎండి సలీమ్ ఉద్దీన్, ఎర్ర శ్రీనివాస్, సుద్దాల లక్ష్మణ్, సముద్రాల అజయ్ మైసన్ మనోహర్, చొప్పదండి సత్యం, చామనపెల్లి చంద్ర శేఖర్, గోస్కి శంకర్, కొండ్రా స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

Donthi Gopi PRO DCC Knr: మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ గారు మాట్లాడుతూ

నేడు రాష్ట్రంలో ప్రాజెక్టుల గురించి కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

స్వాతంత్ర అనంతరం ఈ దేశంలో బాక్రానంగళ్ ప్రాజెక్ట్ తో పాటు ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఇందిరా గాంధీ హయంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కట్టిన శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవన్నీ కాంగ్రెస్ పరిపాలనకు నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు వీటన్నిటిని చూసి మాట్లాడాలి

నాణ్యతతో ప్రాజెక్టులు నిర్మించడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం

ఇవన్నీ చూసి కూడా ఈ విధంగా హరీష్ రావు మాట్లాడటం శోచనీయం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పు జరిగిందని చెప్పకపోవడం విడ్డూరంగా ఉంది

ప్రాజెక్టుల గురించి ప్రభుత్వానికి శ్రద్ధ లేదని హరీష్ రావు మాట్లాడడం ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆరోపణలు విమర్శలు చేయడం మంచిది కాదు

అనుభవం లేని ఇంజనీర్లను నాణ్యతలేని కాంట్రాక్టర్ల లకు బాధ్యతలు అప్పగించి ప్రాజెక్టులో నిర్మాణం చేపట్టి ప్రజాధనాన్ని గంగా పాలు చేసినారు

కెసిఆర్ ప్రభుత్వంలో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్రం నుండి వచ్చిన ఇంజనీర్లు పర్యవేషక బంధం ప్రకటించడం జరిగింది తప్ప ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు

బహుళ ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నప్పుడు అందుకు పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించవలసిన అవసరం ఉంటుందని ప్రభుత్వాలు బాధ్యతగా వహించాలి, ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకు ఇవ్వవలసి ఉంటుంది

కాంట్రాక్టర్ల జేబులు నింపడంతో పాటు నాడు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు తమ జేబులు నింపుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరిగి విమర్శలు చేస్తున్నారు

కాంట్రాక్టర్ ద్వారా బిఆర్ఎస్ నేతలు లబ్ధి పొందినారు అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి, కాలేశ్వరం నిర్మాణంలో తప్పు జరిగిందని కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఒప్పుకోవాలి,

ఈ నెల 16న జరగనున్న శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష నేతలు హాజరై ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరపాలి ప్రభుత్వం ఎలా ఉంటే బాగుంటుంది అనే సూచనలు చేయాలి

మానెరు వంతెనపై నిర్మించిన చెక్ డ్యాములు కేవలం నీటి ఒత్తిడికి కూలిపోయినాయి అంతటి నాణ్యత లోపంతో చెక్ డ్యాములు నిర్మించిన బిఆర్ఎస్ నేతలు వాటిని బాంబులు పెట్టి పేల్చివేసామని చెప్పడం హాస్యాస్పదం

ప్రాజెక్టుల నిర్మాణంలో కనీసం విధివిధానాలు పాటించకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు

ఈ విధంగా ప్రజాధనాన్ని, సమయాన్ని వృధా చేసిన బిఆర్ఎస్ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

Leave A Reply

Your email address will not be published.