ముద్ర కాప్రా:
కార్మికులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే తరచూ హెల్త్ క్యాంపుల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కాప్రా సర్కిల్ కార్యాలయంలో పారిశుద్ధ్య, ఎంటమాలజీ , ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల కోసం ప్రసాద్ హాస్పిటల్, నాచారం ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కార్మికులు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మ, మెడికల్ ఆఫీసర్ మమత, మేనేజ్‌మెంట్ ప్రతినిధి రవి, నాచారం డీఈఈ రవిచంద్, శాంతి సూపర్వైజర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.