ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం కేటిదొడ్డి మండలంలోని కుచినెర్ల, చింతలకుంట, గువ్వలదిన్నే, ఇర్కిచేడు, కేటి దొడ్డి గ్రామాలలోని రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారం నిర్వహించారు
ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి రాజవర్దన్ రెడ్డి సాగు భూమి ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, వినియోగదారులు కోరుకునే సన్నరకాల సాగు వంటి వివరాలపై రైతులకు అవగాహన కల్పంచారు. అలాగే అధిక సాంద్రత పత్తి, వాటి లాభాలు, యాజమాన్య పద్ధతులు, పంట మార్పిడి, పురుగు మందుల పిచికారి విధానం గురించి వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆయిల్ పామ్ సాగు చేపట్టడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. మట్టి పరీక్ష ఫలితాల పంపిణీ
కార్యక్రమం అనంతరం రైతులకు మృదా పరీక్ష (Soil Test) ఫలితాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించడమే కాకుండా, వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల వినియోగంపై అవగాహన కల్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ కుర్వ హన్మంతు, మండల రెవెన్యూ అధికారి కరుణాకర్, ఎంపీడీవో రమణరావు, మండల విద్యాధికారి (MEO), ఎస్ఐ శ్రీనివాసులు వ్యవసాయ విస్తరణ అధికారులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.