Take a fresh look at your lifestyle.

కరీంనగర్‌లో ఘనంగా సూపర్ ఫైటర్స్ కప్–2026

తెలంగాణ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో క్రీడాకారుల ప్రతిభ
వివిధ విభాగాల్లో ఉత్సాహంగా పోటీలు
విజేతలకు ట్రోఫీలు, పతకాల ప్రదానం
సెన్సై అన్వేష్ సురభి ఆధ్వర్యంలో నిర్వహణ

ముద్ర, కరీంనగర్ :

సూపర్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో “సూపర్ ఫైటర్స్ కప్–2026” తెలంగాణ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

పోటీలలో చిన్నారులు, యువకులు వివిధ కేటగిరీల్లో పాల్గొని కటా, కుమిటే విభాగాల్లో ఆకట్టుకున్నారు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించడంలో మార్షల్ ఆర్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమానికి సెన్సై అన్వేష్ సురభి చీఫ్ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు అందజేసి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.