- మంత్రివర్గంలో యాదవ నేతలకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ క్యాబినెట్, పీసీసీ కార్యవర్గంలో కుర్మ, యాదవ సామాజిక వర్గాలకు స్థానం కల్పించాలని కోరుతూ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం వినూత్న నిరసన చేపట్టింది. గొర్రెల కాపరులు లారీలో గొర్రెలు, మేకలతో గాంధీభవన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఎన్నికల్లో యాదవులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు, పీసీసీ కార్యవర్గంలో యాదవ్‌లకు ప్రాధాన్యత తగ్గిందని, మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకొని గొర్రెలను గాంధీ భవన్‌లోకి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, గొల్ల కురుమల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. అనంతరం గొల్ల కురుమల సంక్షేమ సంఘం నాయకులు గాంధీ భవన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు.సంక్షేమ సంఘం నేత శ్రీహరి యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.