Take a fresh look at your lifestyle.

పర్యావరణంపై ఉద్యోగులకు “క్విజ్” పోటీలు

 యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి రామగుండం ఓసీపీ.1 ప్రాజెక్టు ఉద్యోగులకు గురువారం ప్రాజెక్టు యాజమాన్యం పర్యావరణ పరిరక్షణపై క్విజ్ పోటీలు నిర్వహించింది. ఉదయం ప్రాజెక్టు ఆపరేషన్ సైట్ కార్యాలయంలో ప్రాజెక్టు డిప్యూటీ జనరల్ మేనేజర్ కే. కిషన్, ప్రాజెక్టు రక్షణ అధికారి అజయ్ కుమార్ లు ఉద్యోగులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్విజ్ పోటీల్లో విజేతలైన ఉద్యోగులకు వారు బహుమతులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎన్టియూసి కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్, పిట్ కమిటీ కార్యదర్శి జి. వెంకటస్వామి, ఏఐటియూసి పిట్ కమిటీ కార్యదర్శి డిటి. రావు, ప్రాజెక్టు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.