శాస్త్రచికిత్స చేసిన రోజే నడిచిన భువనగిరికి చెందిన 78 ఏళ్ల మహిళ..
డాక్టర్ విక్రమ్ భైరి ఆధ్వర్యంలో విజయవంతమైన చికిత్స
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్,రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ భైరి ఆధ్వర్యంలో అరుదైన రోబోటిక్ మోకాలి మార్పిడి (రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్) శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక బైపాస్ రోడ్డు పక్కన ఉన్న సంకల్ప్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విక్రమ్ భైరి మాట్లాడుతూ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 78 ఏళ్ల రాజలక్ష్మి అనే మహిళకు రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్ శాస్త్రచికిత్స చేసిన సాయంత్రానికే ఆమె ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్లినట్లు తెలిపారు. ఈ శస్త్రచికిత్స జరిగి ఇప్పటికి ఐదు నెలలు పూర్తయ్యాయని, ఈ కాలంలో ఆమెకు ఎలాంటి కాళ్ల,కీళ్ల నొప్పులు లేకుండా మునుపటికంటే మెరుగ్గా నడవగలుగుతున్నారని వెల్లడించారు. తన వద్దకు వచ్చే రోగులకు మోకాళ్ల నొప్పులకు సంబంధించి శాతానికి శాతం ఉపశమనం కలిగేలా చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. శాస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ చేయించుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. అలాగే పాజిటివ్ మైండ్‌తో ఉండి ఒత్తిడిని తగ్గించుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. శాస్త్రచికిత్స చేయించుకున్న రాజలక్ష్మి మాట్లాడుతూ మోకాళ్ల నొప్పుల కారణంగా నడవడం కూడా కష్టంగా ఉండేదని, ప్రతి అడుగులోనూ తీవ్రమైన నొప్పి అనుభవించాల్సి వచ్చేదని చెప్పారు. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలోని డాక్టర్ విక్రమ్ భైరిని సంప్రదించి రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్ శాస్త్రచికిత్స చేయించుకున్నామని తెలిపారు. డాక్టర్ విక్రమ్ భైరి ఆధ్వర్యంలో వైద్యులు కన్నకొడుకులా చూసుకుని శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి నొప్పులు లేకుండా అన్ని పనులు చేసుకుంటూ సాధారణంగా జీవనం సాగిస్తున్నామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యశోద ఆస్పత్రి మార్కెటింగ్ జనరల్ మేనేజర్ సుదర్శన్ రెడ్డి, వెంకట్ సీనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ రవితేజ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.