Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు

  • బిఆర్ఎస్ రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలి.
  • కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

ముద్ర,పానుగల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్నిది అరాచకపు పాలన అని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహా సభ కు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని అన్నారు.పానగల్ మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 న వరంగల్ లో నిర్వహించే ఇరవై ఐదేండ్ల గులాబీ పండుగను విజయవంతం చేసేందుకు గ్రామ,గ్రామాన పార్టీ కార్యకర్తలు తరలి రావాలన్నారు.ప్రజా పాలనలో ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్న వారిపైన అక్రమ కేసులు నమోదు చేసున్నరన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర లోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ప్రజా పాలన అంటూ కాంగ్రెస్ నాయకులు తామంతట తామే అనుకుంటున్నారని ప్రజాపాలన అంటే ప్రజలు ప్రభుత్వాన్ని మెచ్చుకునే విధంగా ఉండాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు,రైతులు అసహ్యించుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్ర శేఖర్ నాయక్,జ్యోతి నందన్ రెడ్డి, వెంకటయ్య నాయుడు,అడ్వకేట్ రవికుమార్, సంగనమోని శేఖర్,రాజేష్ రెడ్డి,వీర సాగర్,వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీలు,సర్పంచులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.