Take a fresh look at your lifestyle.

కేటీఆర్​ కు అరెస్ట్​ భయం పట్టుకుంది

  • తప్పు చేయకపోతే జంకు ఎందుకు..?
  • ఫార్ములా ఈ రేసులో జరిగిన అవినీతి తేలుతుంది.
  • కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది ధ్వజం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తప్పు చేయనప్పుడు అరెస్ట్‌కు ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిలదీశారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన దిమ్మతిరిగే తీర్పుతో ఈ మధ్య కల్వకుంట్ల కుటుంబం కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని చురకలంటించారు.ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు సైతం వరుస కేసులతో ప్రజా సేవను గాలికొదిలేశారంటూ మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేసు కేసును లొట్టపీసు కేసు అన్న కేటీఆర్‌పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. లోపల భయంతో వణికిపోతున్నాడని తెలిపారు.ఈనెల 16న ఏసీబీ విచారణకుహాజరై బయటకు వచ్చిన వెంటనే..కేటీఆర్‌కు బీఆర్ఎస్ వర్గాలు బాణాసంచా కాల్చి స్వాగతం పలకడం ఏంటని ప్రశ్నించారు. అరెస్ట్ చేయనందుకు సంబురాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. తప్పు చేసినోళ్లకు రాచమర్యాదలట.. బావ, బావమరుదుల ఆలింగనాలట అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రతిష్టను నాశనం చేసి గొప్పలు చెప్పుకుంటున్న కేటీఆర్‌కు సిగ్గుండాలని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.