Take a fresh look at your lifestyle.

మాజీ సీఎం రోశయ్య జీవితం ఆదర్శనీయం

  • రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి సంగీత.
  • కలెక్టరేట్లో అధికారికంగా రోశయ్య జయంతి వేడుకలు.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య లాంటి మహనీయుల జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహిచిన కొణిజెటి రోశయ్య జయంతి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పాల్గొని కొణిజెటి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ సంగీత మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వైయస్సార్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారని, ఆర్థిక శాఖ తోపాటు రోడ్లు భవనాలు రవాణా శాఖ మంత్రిగా హౌసింగ్ శాఖ మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రిగా హోమ్ మినిస్టర్ వైద్య ఆరోగ్యం, విద్యాశాఖ మంత్రిగా కూడా కొంతకాలం తన సేవలు అందించారని, వైయస్సార్ హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రిగా కొంత కాలం తన సేవలు అందించారని, అనంతరం తమిళనాడు గవర్నర్ గా పని చేసారని తెలిపారు.మహనీయుల ఆశయాలను నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వర రావు,కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సునీల్, కలెక్టరెట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.