ఆలేరులో జరిగే ప్రజానాట్యమండలి జిల్లా 3వ మహాసభలు జయప్రదం చేయండి : జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్
ముద్ర, యాదగిరిగుట్ట :
ఆలేరులో ఈనెల 20న జరిగే తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా 3వ మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ కళాకారులకు పిలుపునిచ్చారు.
ప్రజానాట్యమండలి యాదగిరిగుట్ట మండల మహాసభ శనివారం మర్రిగూడెం గ్రామంలో మీసాల దాసు అధ్యక్షతన నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పాటలు రచించి ప్రజాపాటలుగా ప్రజలను చైతన్యం చేయడం కొరకు ఆలపించేటువంటి సంస్థ తెలంగాణ ప్రజానాట్యమండలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ యాదగిరిగుట్ట మండల కార్యదర్శి కలేపల్లి మహేందర్, ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షురాలు ఇంజ హేమలత, బోధసు స్వామి నాతగాని కిష్టమ్మ,గడ్డం యాదమ్మ,అంజమ్మ అనురాధ,కన్నాయి మనోహర, చందన, వసంత లక్ష్మి పాల్గొన్నారు. మహాసభ నూతన కమిటీని ఎన్నుకోగా గౌరవాధ్యక్షులుగా మీసాల దాసు, అధ్యక్షులుగా కన్నాయి మనోహర,
ప్రధాన కార్యదర్శిగా నాటకాని కిష్టమ్మ, కోశాధికారిగా గడ్డం యాదమ్మ తోపాటు 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.