Take a fresh look at your lifestyle.

ఇంటర్ పరీక్షలు సాఫీగా జరగాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

*ముద్ర ప్రతినిధి, మెదక్ :
ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు.
శుక్రవారం నర్సాపూర్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగున్న పరీక్షలను పరిశీలించారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
త్రాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.వెంట తహసిల్దార్ శ్రీనివాస్ అధికారులున్నారు.
మూడవ రోజు ప్రశాంతం
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఇంగ్లీష్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి.
మొదటి సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగం లో 5877 గాను 5716 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 608 గాను 589 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు.
జిల్లాలో మూడవ రోజు హాజరు శాతం 97.25 % గా నమోదైందని జిల్లా అధికారి మాధవి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.