Take a fresh look at your lifestyle.

ఎస్సీ ,ఎస్టీల కేసులలో అలసత్వం చేస్తే సహించం -రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులా..?

*ముద్ర ప్రతినిధి, మెదక్ :

ఎస్సీ, ఎస్టీలపై తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని, ఎస్సీ, ఎస్టీల కేసులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు హెచ్చరించారు.
శుక్రవారం మెదక్ కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ..
ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే అరికట్టలన్నారు. నర్సాపూర్ పెద్ద చింతకుంట గిరిజనులపై జరిగిన దాడి కేసు విచారణలో ఐవోను మార్చాలని ఎస్పీని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనానికి మార్చి 26 వరకు స్థలానికి కేటాయించి భవన నిర్మాణం ప్రారంభించాలని ఆర్డీవోను ఆదేశించారు. హవేలి ఘనపూర్ తదితర గ్రామాలలో నెలకొన్న భూమి సమస్యలను 45 రోజులలో పరిష్కరించాలని ఆదేశించారు. నర్సాపూర్ మండలం మమతాబాద్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి వసతులపై నాణ్యమైన భోజనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు నివేదిక సమర్పించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారము అందించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ బాధితులకు ప్రారంభం కింద డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని చైర్మన్ ఆదేశించారు. హత్య, అత్యాచారం, సాంఘిక బహిష్కరణ తదితర కేసులలో బాధితులకు పక్క ఇండ్లను అందించాలని కోరారు. చరిత్రలోనే రాష్ట్రా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలలో ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్లను పంపిణీ చేశామని తెలిపారు.
వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. మెదక్ పట్టణంలోని ఎస్సీ కార్పొరేషన్ నూతన దుకాణాల సముదాయాలను తక్షణమే నిర్మాణాలను ప్రారంభించాలని ఆదేశించారు. మెదక్ పట్టణాంలో ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెడతారా రాష్ట్రంలో కోడై కొస్తుందన్నారు. అందుకు డి ఎస్పీ ప్రసన్న కుమార్ వివరణ ఇచ్చారు. తుప్రాన్ డివిజన్ లో ఎక్కువ కేసులు నమోదు అయినా పోలీసు అధికారులు సరైన రీతిలో పట్టించుకోవడం లేదని డిబిఎఫ్ కార్యదర్శి శంకర్ ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, అడిషనల్ కలెక్టర్ నగేష్, ఎస్పీ శ్రీనివాసరావు, షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ, ట్రైని అధికారి సింధు, దళిత సంఘాల నాయకులు, డివిఎంసి సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.