ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ నగరంలోని అయ్యప్ప కొండ, పద్మావతి కాలనీలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సేవాలాల్ మహారాజ్ గిరిజన, బంజారా సమాజానికి మార్గదర్శకునిగా నిలిచారన్నారు. సమాజంలో నైతిక విలువలు, సేవాభావం, ఐక్యత, సామరస్యం, ధర్మబద్ధత వంటి సద్గుణాలను పెంపొందించడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొంది సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, సామాజిక సమానత్వం వంటి అంశాలు సేవాలాల్ మహారాజ్ ఆశయాల్లో కీలకమని, ఆ దిశగా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉన్నారన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు.
అంతకుముందు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మమత , డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్లు సువర్ణ , దేవ్లీ, సీబీ పూజిత, నాయకులు శేఖర్ నాయక్, ఆర్. శేఖర్ నాయక్, అంతిరాం నాయక్, ప్రతాప్, తిరుపతి నాయక్, రఘురామిరెడ్డి, ఆనంద్ కుమార్, అనిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post
Next Post