ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్యవైశ్య సమాజానికి చెందిన అల్లంపల్లి శ్రీను అనారోగ్యంతో మరణించడంతో, వారి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్న ఆర్థిక సహాయం అందించారు.
ఈ విషయాన్ని ఆర్యవైశ్య సంఘం నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల వెంకటేష్ అన్న, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయంగా ఆర్థిక సాయం అందించారు. అలాగే, మృతుడి పిల్లల విద్యకు అవసరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కల్వకుర్తి మండలం అధ్యక్షుడు గంధం ప్రసాద్, జిల్లా నాయకుడు దాచపల్లి శ్రీనివాసులు, ఉప్పల వెంకటేష్ అనుచరులు దారమోని గణేష్, ఐలా శేఖర్ గౌడ్, అలాగే ఆర్యవైశ్య సంఘం నాయకులు పోల నరేష్, ఆకారం శివ తదితరులు పాల్గొన్నారు.