Take a fresh look at your lifestyle.

అల్వాల్ లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయండి – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

 

ముద్ర: మల్కాజిగిరి

అల్వాల్ లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుకు సచివాలయం లో గురువారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వల్లభ నగర్‌లో ఉండడం వల్ల అల్వాల్ మండలానికి చెందిన ప్రజలు ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొంటూ సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు సాధారణ ప్రజలు రిజిస్ట్రేషన్ పనుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
అల్వాల్ మండల పరిధిలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రజలకు సమయం, వ్యయం ఆదా అవడంతో పాటు పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని ఎమ్మెల్యే సూచించారు.
వినతి పత్రంపై మంత్రి, ప్రత్యేక కార్యదర్శి సానుకూలంగా స్పందించి అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అరుణ్ తేజ రావు, సతీష్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.